Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్పిఎం మోడీ గో బ్యాక్‌ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు

పిఎం మోడీ గో బ్యాక్‌ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోడీ ఎలా వస్తారని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్‌ అంటూ పద్మావతినగర్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకొని నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్‌ రంగనాయుడు, జిల్లాసహాయ కార్యదర్శి బాబాపకృద్దీన్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య ,ఏఐవైఎఫ్‌ నాయకులు నాగరాముడు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రతాప్‌లతో పాటు సుమారు 10 మందిని అరెస్టుచేసి రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్‌, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కృషి చేయడం లేదని ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాలను నేటి వరకు అమలు చేయకుండా రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడం సరైనది కాదని, రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులిస్తామని నీళ్లు, మట్టి ఇచ్చి మరోసారి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం సరైంది కాదని, ఇచ్చిన మాట తప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకు పోయేలాచేయడం దుర్మార్గమని, అదే విధంగా 8 సంవత్సరాల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసిన జిఎస్టిని తెచ్చింది ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి ప్రభుత్వమే అని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు