Sunday, November 16, 2025
Homeజిల్లాలుకర్నూలురాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వని నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ బుధవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు. జీఎస్టీ సుంకాలు తగ్గింపు కారణంగానే మోదీ కర్నూలుకు వస్తున్నారని ఆరోపించారు. 16 నెలల కాలంలో రాష్ట్రానికి ప్రధానమంత్రి నాలుగు సార్లు వచ్చారని ఒక్క సారైనా ప్రజలకు మేలు చేశారా అని ప్రశ్నించారు. 2017లో ప్రధాని మోదీ 28 శాతం జీఎస్టీ విధించినప్పుడే వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయన్నారు. జీఎస్టీ విధించిన దేశాలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవన్నారు. 55 లక్షల కోట్లు ప్రజల నుంచి పిండుకున్న కేంద్రం కేవలం 48వేల కోట్ల భారాన్ని తగ్గించి పండుగ చేసుకో అంటుందని విమర్శించారు. దొంగలించిన సొమ్ము తిరిగి ఇస్తున్నందుకా, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసేందుకా ప్రజలు దేని కోసం పండుగ జరుపుకోవాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే దాని గురించి పట్టించుకోవడంలో , పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యారన్నారు. నల్ల ధనాన్ని బయటకు తీసి ప్రజలను ధనవంతులు చేస్తానని ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కనీసం రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవదాసు, ఓబులేశు, ఆంజనేయ, ఆటో కుంటెన్న, తలారి బాబు, హుస్సేన్, బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు