విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ సబ్ జూనియర్ జూడో పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం సిల్వర్ తెలంగాణలోని హైదరాబాదులో 16వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని చిగిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి 45 కేజీల విభాగంలో రెండవ స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ 45 కేజీల పోటీలలో మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు మొత్తం 32 మంది పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. మణిపూర్ రాష్ట్రానికి స్వర్ణ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రజత పతకం మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలకు కాంక్ష పథకం సాధించడం జరిగిందని తెలిపారు. జాతీయ సబ్ జూనియర్ జూడో పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి 10 సంవత్సరాల తర్వాత వెండి పతకం సాధించడం విశేషమని వారు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం
- Advertisement -
RELATED ARTICLES


