Homeఅంతర్జాతీయంమెస్సీ మరో చరిత్ర.. ప్రపంచకప్‌లో ఎవరూ సాధించని ఘనత

మెస్సీ మరో చరిత్ర.. ప్రపంచకప్‌లో ఎవరూ సాధించని ఘనత

- Advertisement -

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కేప్ వెర్డేపై జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో గోల్ చేసి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా అదనపు సమయంలో 3-2 తేడాతో విజయం సాధించింది.మ్యాచ్ 29వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న మెస్సీ తనదైన శైలిలో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ప్రపంచకప్‌ల్లో అతని మొత్తం గోల్స్ సంఖ్య 20కు చేరింది. ఫలితంగా తన సొంత రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. వరుసగా ఎనిమిది ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో మొత్తం 12 గోల్స్ నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.అయితే అర్జెంటీనాకుకేప్ వెర్డే గట్టి పోటీ ఇచ్చింది. సిడ్నీ లోపెస్ కబ్రాల్ తొలి గోల్‌కు సమాధానంగా స్కోరు సమం చేయగా అదనపు సమయంలో లిసాండ్రో మార్టినెజ్ మరోసారి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. డెరాయ్ డువార్టే మళ్లీ సమం చేసినా 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడ్డర్ ప్రత్యర్థి ఆటగాడు డైనీ బోర్జెస్‌కు తాకి ‘ఓన్‌ గోల్‌్ణగా మారడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది.

ఈ గెలుపుతో అర్జెంటీనా ప్రీక్వార్టర్ దాటగా తదుపరి రౌండ్‌లో ఈజిప్ట్‌తో తలపడనుంది. మరోవైపు ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పేపై ఒక గోల్ ఆధిక్యం సాధించడంతో పాటు, ప్రపంచకప్ ఆల్‌టైమ్ గోల్స్ జాబితాలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు