ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. పది కంపెనీలకు గానూ ఐదు కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంల్లోని ఐదు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 -స్నేహా హౌస్, బంజారాహిల్స్ – రోడ్ నెంబర్ – 2- సాగర్ సొసైటీ, కాటేదాన్ – రాజేందర్ నగర్, ఖైరతాబాద్ – కమలాపురి కాలనీ – ఫేజ్ వన్‌లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వాల్తేర్ రోడ్ – వెస్ట్ వింగ్ – విశాఖపట్నంలో ఉన్న మరో కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ – విశాఖపట్నంల్లో సిట్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని 8 కంపెనీలకు గానూ 4 కార్యాలయాలు, విశాఖపట్నంలోని రెండు కంపెనీల్లో ఒక కార్యాలయం సునీల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్‌ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు సునీల్ రెడ్డి. ప్రైవేట్ లిమిటెడ్, LLP ఫౌండేషన్ హోదాల్లో సునీల్ రెడ్డి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తుండటంతో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం..జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు..
- Advertisement -
RELATED ARTICLES


