Wednesday, January 14, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..

నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..

- Advertisement -

ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జె.వి. సురేష్ బాబు , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి. హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నేపథ్యంలో అప్లికేషన్ డెవలపర్,( వెబ్ అండ్ మొబైల్ అనే ఉచిత కంప్యూటర్ కోర్సును డిసెంబర్ 17 నుండిప్రారంభిస్తామని తెలిపారు. దీనికి 10వ తరగతి, ఇంటర్ పాస్, అలాగే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బిఎ, బీకాం విద్యార్హత కలిగిన ఆసక్తి గల యువతీ–యువకులు డిసెంబర్ 16 లోపు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలుతీసుకోవడం జరుగుతుందన్నారు. నమోదు ,వివరాల కోసం సెల్ నెంబర్ 91822 88465 లేదా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నేరుగా సంప్రదించవచ్చు అని తెలిపారు.
నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు