విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలోని రాంనగర్ వద్ద చేనేత కార్మికుడు నీలూరి కృష్ణమూర్తి (60 సంవత్సరాలు) అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికులు భార్య గుర్తించి పోలీసులకు టూ టౌన్ సీఐ రెడ్డప్పకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలను తెలుసుకొని భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. మృతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ ముగ్గురికి బ్రతికున్న సమయంలో ఘనంగా వివాహం చేశారు. అనంతరం అప్పుల బెడద కావడంతో, ప్రతిరోజు మానసికంగా బాధపడేవాడని తెలిపారు. దీంతో చేసేది లేక జీవితముపై విరక్తి చెంది, అప్పు ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకుని మృతి చెందడం జరిగిందని తెలిపారు. స్థానికులు కుటుంబ సభ్యులు ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. తదుపరి టూ టౌన్ సీఐ రెడ్డప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మాస్టర్ నిర్మించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అప్పుల బాధతో చేనేత కార్మికుడు మృతి
- Advertisement -
RELATED ARTICLES


