Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘంటసాల గంభీరమైన స్వరము కలవారు.. కళావతి అధ్యక్షులు నారాయణ

ఘంటసాల గంభీరమైన స్వరము కలవారు.. కళావతి అధ్యక్షులు నారాయణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ఘంటసాలకు గంభీరమైన స్వరం దేవుడు ఇచ్చిన వరమని అందుకే ఆయన దేశవ్యాప్తంగా మంచి గాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందని కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు గంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జయంతి సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గంటశాల సంగీత దర్శకులుగా గాయకుడిగా శాస్త్రీయ సంగీతములో క్షున్న మైన శిక్షణతో తెలుగు సినిమా సంగీతానికి విశేషమైన కృషి చేయడం జరిగిందన్నారు. వారు పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్, లవకుశ, గుండమ్మ కథ వంటి అనేక ముఖ్యమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహనీయుడని తెలిపారు. ఘంటసాల తెలుగుతోపాటు కన్నడ, తమిళం ,మలయాళం ,తులు, హిందీ భాషలలో కూడా సంగీత రంగంలో పనిచేయడం జరిగిందన్నారు. నేటికీ ప్రముఖ చిత్రాలు అందరిని ముగ్ధుల్ని చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఘంటసాల పాటలు వినిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. అందుకే ఈనెల 27వ తేదీన కళాజ్యోతిలో ఘంటసాల జయంతిని పురస్కరించుకొని సాయంత్రం పాటల కచేరికార్యక్రమము ఉంటుందని, స్థానిక కళాజ్యోతి కళాకారులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఘంటసాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి అశ్వత్ నారాయణ, డైరెక్టర్ రమేష్ బాబు, పెద్దారెడ్డి, రాంప్రసాద్, ఎల్ఐసి రామకృష్ణ, మధుసూదన్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు