Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేట్రేగిపోతున్న ధరలు.. కల్తీలు…

పేట్రేగిపోతున్న ధరలు.. కల్తీలు…

- Advertisement -

దిక్కు తోచని స్థితిలో పేద మధ్యతరగతి కుటుంబాలు
కల్తీ పదార్థాలు తిని ఆసుపత్రి పాలు
ప్రేక్షక పాత్రలో అధికారులు

విశాలాంధ్ర- చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గ వ్యాప్తముగా ప్రజలకు అవసరమైన నిత్యవసరాలు ధరలతో పాటు కల్తీలు పేట్రేగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు కల్తీ పదార్థాలు భుజించి ఆసుపత్రి పాలవుతున్నారు, అధికారులు ఉదాసీనత కారణంగా నిత్యవసరాలు సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇదే అదునుగా వ్యాపారుల పదార్థాలు కల్తీ మయంగా మారాయి దీంతో దిక్కు తోచని స్థితిలో మధ్య తరగతి కుటుంబాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి ఈ కల్తీ పదార్థాల విషయంపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి చోద్యం చూస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు, నిత్యవసరాల ధరలు భారం కావడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు, వీటికి తోడు కూరగాయ ధరలు అటుకెక్కి కూర్చున్నాయి అకాల వర్షం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ధరలు అవసరాన్ని బట్టి పెరిగిపోయినాయి, అంతేకాక ప్రజలకు సరిపడే సరుకులు రాకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు, ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి జీవనశైలి పెను బారముగా మారింది
ఈ తరుణంలో మధ్యవర్తులు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు, రైతులు ఎండా గాలి వాన అనక రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతేకాక ఉప్పు కారం నుండి తినే నెయ్యి వరకు కల్తీమయంగా మారుతున్నాయి నిత్యావసరాలు తయారీదారులు వినియోగదారుల ఆరోగ్యాన్ని మరచి పదార్థాలు కల్తీ చేసి మరీ సొమ్ము చేసుకుంటున్నారు ఫాస్ట్ ఫుడ్, హోటల్స్, బేకరీలు, దుకాణాలు తదితరముల సెంటర్లలో స్వీట్లు తదితర పదార్థాల తయారీ సమయంలో వాటికి రంగులు ఆకర్షణీయంగా కనబడేందుకు మెటానిల్ అనే కెమికల్ వాడుతున్నట్లు సమాచారం, వాటిని ఆహారంగా స్వీకరించిన వారికి జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుందని సమాచారం, ఆ పదార్థాలతో అంత ప్రమాదం అని తెలిసినను ఆ తయారీదారులకు పట్టడం లేదు ముఖ్యముగా పాలు నెయ్యి నూనెల కల్తీలతో క్యాన్సర్ తదితర రోగాలు వస్తాయి, ఏది ఏమైనాప్పటికీ అధిక ధరలు కల్తీ పదార్థాలు కల్తీ నూనెల పై ఆయా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవలసినప్పటికీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి, కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారించి ధరలు నియంత్రించి కల్తీలు పని పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు మేధావులు చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు