Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసర్వే నెంబర్ లో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి

సర్వే నెంబర్ లో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి

- Advertisement -

ధర్మవరం లో రూ. 60 కోట్ల విలువైన 650-2 సర్వే నెంబర్ లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో 60 కోట్లు విలువైన 650-2 సర్వే నెంబర్లు జరిగిన భారీ అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు
పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తరువాత ఎమ్మార్వో కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ
ధర్మవరం పట్టణంలోని బెంగళూరు వెళ్లే రోడ్డు నందు గల 650-2 సర్వే నంబర్ లో 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పేదల పేర్లు చెప్పుకొని ప్లంబర్స్ యూనియన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుమ్మక్కై ఆ ప్రభుత్వ భూమిని అర్హులైన ప్లంబర్ల కు అందకుండా తమ బినామీ పేర్లతో ఆ భూమిని అంతా నొక్కేశారు అని మండిపడ్డారు. వీరికి అప్పటి తాసిల్దార్ రమేష్ అవినీతి అక్రమార్కులకు పూర్తిగా సహకరించారు అని తెలిపారు. 1996 లో ప్లంబర్ అంతా ఒక యూనియన్ గా ఏర్పాటు చేసుకొని పట్టాల కోసం ప్రభుత్వాన్ని విన్నవించుకోగా వారికి మంజూరు చేసిందన్నారు. అయితే సదరు భూమి మాది అంటూ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో అప్పటినుంచి అది పెండింగ్లో పడుతూ వచ్చింది అని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో భూమి యజమానులు ప్లంబర్స్ యూనియన్ రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని తీర్పునిచ్చింది అని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్లంబర్స్ యూనియన్ ముసుగులో అప్పటి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని భూమి యజమానులను బెదిరించి మరోవైపు అసలైన ప్లంబర్స్ ని కూడా తొక్కి పెట్టేసి, యూనియన్ పేరు చెప్పుకొని ముగ్గురు వ్యక్తులు దాదాపు 30 నుంచి 35 పట్టాలు తమ బినామీ పేర్లతో దోచేశారు అని మండిపడ్డారు. పట్టాలు ఇచ్చినందుకు అప్పటి ఎమ్మార్వో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ కూడా 21,24,66 నెంబర్ గల పట్టాలు బినామీ పేర్లతో కేటాయించి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సదరు తాసిల్దార్, అప్పటి కమిషనర్ కు నజరానాగా ఇచ్చినట్లు సమాచారం అని తెలిపారు. 60 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి కేవలం యూనియన్ లోనీ ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది అన్నారు. ఆ ముగ్గురిలో డి రాజు, డి సురేంద్రలు అన్నదమ్ములు కావడం విశేషం అన్నారు. మరో వ్యక్తి ఎన్. లతీఫ్ లు ఉన్నారు అని తెలిపారు. రూ. 60 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమిని యూనియన్ ముసుగులో తల్లి, తండ్రి, సోదరి, తోడల్లుడు, కూతురు, మరదలు, మేనల్లుడు, సోదరుడు, అత్త, స్నేహితుల పేర్లు పెట్టీ నిండా దోచేసారాన్నారు. వీరిపై చట్టబద్దంగా విచారించి అసలైన అర్హులకు విలువైన పట్టాలు అందేలా చర్యలు తీసుకొనీ, సదరు వ్యక్తులపై 420 కేసులు నమోదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం నాయకులు అధ్యక్ష,కార్యదర్శులు, గోవిందరాజు, లక్ష్మనారాయణ, ఉపాధ్యక్షులు, తాజుద్దీన్, సురేంద్ర, సుబ్బయ్య, ఆంజనేయులు, రామకృష్ణ, మసూద్, మరియు మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు