Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రత్యేక అధికారులుగా నియామకాలు

ప్రత్యేక అధికారులుగా నియామకాలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియడంతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం పూర్తి అయినది. దీంతో ప్రభుత్వ జీవో నెంబర్ 47 ప్రకారం ఏప్రిల్ మూడవ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. పంచాయితీ ఎన్నికలు జరిగే వరకూ స్పెషల్ ఆఫీసర్లుగా మీరు కొనసాగిస్తారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తున్న ఎం లలితకు నాలుగు పంచాయతీలను స్వాధీనం చేశారు. వాటిలో పోతుల నాగేపల్లి గ్రామపంచాయతీ, ధర్మపురి గ్రామపంచాయతీ, సీసీ కొత్తకోట గ్రామపంచాయతీ, నేలకోట తండా పంచాయితీ, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేష్కు కు మల్లా కాల్వ, వెంకట తిమ్మాపురం, రావులచెరువు, పోతుకుంట గ్రామపంచాయతీలు, డిప్యూటీ ఎంపీడీవో శేషావలి కుగొట్లూరు, మల్కాపురం, దర్శనమల గ్రామపంచాయతీలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు