Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది

రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు
విశాలాంధ్ర -ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది అని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, రామచంద్రగుప్త తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి కీర్తిశేషులు పుల్లమ్మ, కీర్తిశేషులు బోనాల వెంకటనారాయణ వారి జ్ఞాపకార్థం కుమారుడు పుల్లయ్య, కోడలు రాధాదేవి వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తాయని తెలుపుతూ ఆసుపత్రి తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కేత లోకేష్, దాతలు పుల్లయ్య, రాధాదేవి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు