విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాండ్లవీధి కి చెందిన కీ శే చింతా చిన్న కొండన్న ( 36) ఏప్రిల్ 1వ తేదీన రోడ్డు ప్రమాదం లో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు గురువారం ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు విజయవాడ ఎల్ వి ప్రసాద్, నేత్రాలయ వారి టెక్నీషన్ యు. ప్రసాద్ గారు కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత తల్లి శకుంతలమ్మ భార్య గీతాంజలి కుటుంబ సభ్యులు నాగేశ్వరి,ముత్యాలు,అశ్విని సూరి, పెద్దకొండప్ప,శ్రీనివాసులు శంకరనారాయణ కు సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరేంటెండ్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ , డాక్టర్ హరి శ్రీనివాసులు విశ్రాంత వైద్యులు డాక్టర్ నరసింహులు,డాక్టర్ నివేదిత, డాక్టర్ వైష్ణవి ,సేవా సంఘం ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు టి చంద్రశేఖర్ రెడ్డి . జూజారు రఘు, కేశవ రెడ్డి,వెంకటేష్ ఆదినారాయణ,శేషు,వెంకటరమణ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేత్రదానం కొరకు
9392323605,9666629841
9059017583,8247724335
9492323912,9703126122 సంప్రదించాలని తెలిపారు.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత చింతా చిన్న కొండన్న
- Advertisement -
RELATED ARTICLES


