Homeజిల్లాలుఏలూరుగోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి…

గోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి…

- Advertisement -

పోలవరం, కుక్కునూరు, వేలేరుపాదులలో 44 ఘాట్ల ఏర్పాటు

గోదావరి పుష్కర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష…

విశాలాంధ్ర ఏలూరు: రానున్న గోదావరి పుష్కరాలలో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు 2027, జూన్,26వ తేదీ నుండి జులై, 7వ తేదీ వరకు ఉంటాయన్నారు. గోదావరి పుష్కరాలలో పుణ్య స్నానాలకు గాను ఏలూరు జిల్లాలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 44 ఘాట్లను ఏర్పాటుచేసేందుకు గుర్తించడం జరిగిందన్నారు. పోలవరం మండలంలో 36, కుక్కునూరు మండలంలో 3, వేలేరుపాడు మండంలో 5 ఏర్పాటుచేసేందుకు గుర్తించడం జరిగిందన్నారు. ఘాట్ల ఏర్పాటు, అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించి సమర్పించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఘాట్ల నిర్మాణం ఉండాలన్నారు. ఘాట్ల వద్ద టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు, పిండప్రదానాలకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటుచేయాలన్నారు. ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనీ, ఘాట్ల వద్ద భక్తుల రద్దీ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన సంఖ్యలో భక్తులను పుణ్య స్నానాలకు అనుమతించాలన్నారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డిపిఓ, ఇరిగేషన్, రహదారులు,భవనాలు, ఆర్ డబ్ల్యూ ఎస్, సంబంధిత మండల తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు