Homeజిల్లాలుకర్నూలుఘనంగా వసంత పంచమి వేడుకలు

ఘనంగా వసంత పంచమి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ఆస్పరి : మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ నందు శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూజా అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ దీప్తి మాట్లాడుతూ వసంత పంచమి అనేది మాఘ శుద్ధ పంచమి రోజున జరుపుకునే పవిత్ర పర్వదినమని, వసంత ఋతువు ఆరంభానికి ఇది సంకేతమని తెలిపారు. జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక అయిన సరస్వతీ దేవిని ఈ రోజున పూజించడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు. పురోహితులు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల్లో సంస్కృతి, ఆధ్యాత్మికత, జ్ఞానార్జన పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు, సాంప్రదాయ విలువలను కాపాడే దిశగా ముందుకు తీసుకువెళ్లారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు మరిన్ని జరిగి, పిల్లల్లో విద్యా సంస్కారాలు పెరగాలని తల్లిదండ్రులు కోరారు. ఈ వేడుకల్లో పాఠశాల అడ్వైజర్ పవన్ కుమార్, ఉపాధ్యాయులు సతీష్ కుమార్, నీలకంఠ ఈశ్వరప్ప, లావణ్య, అంజినమ్మ, పద్మావతి, నరసింహ, అశ్విని, త్రివేని, పవిత్ర, విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు