Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఆరోపణలపై చర్చకు సిద్ధమా…

ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఆరోపణలపై చర్చకు సిద్ధమా…

- Advertisement -

విశాలాంధ్ర: చిలమత్తూరు..మండల కేంద్రంలోని టిడిపి నాయకులు, నాగరాజు యాదవ్, బాబు రెడ్డి, లక్ష్మీనారాయణ యాదవ్, లక్ష్మీనరసప్ప, గౌరీ శంకర్, తదితరులు విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ పురుషోత్తం రెడ్డి చేసిన ఆరోపణలపై మేము సిద్ధం, బస్టాండ్ ఆవరణంలో బహిరంగముగా చర్చకు మీరు సిద్ధమా… అంటూ నాగరాజ్ యాదవ్ సవాల్ విసిరారు, మండలంలో ఎక్కడైనా సరే ప్రజాసేవ చేశానే గాని తప్పు పనులు చేయలేదన్నారు, ఎక్కడైనా తప్పు చేశానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, అదే నిరూపణ కాకుంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా, మండలంలో వైసీపీలో మీరు తప్పులు చేయలేదా మీకు గుర్తుకు లేదా, అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలి ఇలా రాజకీయ దురుద్దేశంతో బురద చల్లడం సరికాదు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఏ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ వారు ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకెళ్లాలన్నారు. కుళ్ళు కుతంత్రాలు చేస్తూ రాజకీయం చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు