Homeక్రీడలుఆసియా క్రీడలు: షూటింగ్‌లో నీరూ దండాకు స్వర్ణం..

ఆసియా క్రీడలు: షూటింగ్‌లో నీరూ దండాకు స్వర్ణం..

- Advertisement -

భారత్‌ ఖాతాలో ఐదో గోల్డ్!

మహిళల ట్రాప్ షూటింగ్‌లో సత్తా చాటిన నీరూ దండా
ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరూ దండా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఏకాగ్రత కోల్పోకుండా అద్భుతంగా గురిపెట్టిన నీరూ, మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని ముద్దాడారు. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం కాగా, షూటింగ్‌లో వ్యక్తిగత విభాగంలో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.పద‌వ రోజు పోటీల్లో భాగంగా నీరూ అద్భుత ప్రదర్శనతో పాటు మహిళల ట్రాప్ జట్టు రజత పతకాన్ని సాధించి సత్తా చాటింది. అయితే, పురుషుల ట్రాప్ జట్టు పతకాన్ని త్రుటిలో చేజార్చుకుంది. పురుషుల జట్టులో షపత్ భరద్వాజ్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించి ఆశలు రేకెత్తించాడు.ఈ స్వర్ణంతో కలిపి భారత్ పతకాల సంఖ్య 47కి చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు, అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్, అవినాశ్ సాబ్లే వంటి క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడనున్నారు. బాక్సింగ్‌లో పర్వీన్, అంకుశ్ పంఘల్, నరేందర్ సెమీఫైనల్‌కు చేరి, దేశానికి మరో మూడు పతకాలను ఖాయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు