Homeజాతీయంవిద్యుత్ బిల్లులో ఈ-చలాన్లు.. వసూళ్లపై సుప్రీం కీలక సూచన

విద్యుత్ బిల్లులో ఈ-చలాన్లు.. వసూళ్లపై సుప్రీం కీలక సూచన

- Advertisement -

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారుల నుంచి ఈ-చలాన్ల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పేరుకుపోయిన చలానాల మొత్తాన్ని వాహనదారుల విద్యుత్ బిల్లులకు జోడించి వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతుల ద్వారా వసూళ్లు చేయడం కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది.దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ భారీ బకాయిలపై జస్టిస్ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఁఒకే మార్గంలో పయనిస్తామంటే ఈ దేశంలో సాధ్యం కాదు. ఈ-చలాన్ల మొత్తాన్ని విద్యుత్ బిల్లులతో అనుసంధానించండిఁ అని వ్యాఖ్యానించింది.చలాన్లు చెల్లించని వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. అటువంటి వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) పునరుద్ధరణను నిలిపివేయడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. బకాయిల వసూలు కోసం అధికారులు వినూత్నమైన, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు