Homeజిల్లాలువిజయనగరంతహసిల్దార్‌పై దాడి అమానుషం

తహసిల్దార్‌పై దాడి అమానుషం

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహసిల్దార్ బాలకృష్ణపై ఒక మహిళ చేసిన దాడి ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ అధికారిపై కార్యాలయంలోనే దౌర్జన్యానికి దిగడం అమానుషమని, అంగీకారయోగ్యం కాదని రాజాం తహసిల్దార్ యం. రాజశేఖర్ ఖండించారు.ఈ సందర్భంగా దళిత నాయకులు డి. రామప్పడు (రిటైర్డ్ తహసిల్దార్), బొత్స జానకిరావు, బొత్స బుద్ధుడు, జరజాన నీలయ్య, కొల్లి రామారావు, బోనెల నారాయణరావు, ధర్మాన కృష్ణ, బోనెల గౌరిశ్వరరావు, అలాగే టీచర్స్ అసోసియేషన్ రిటైర్డ్ పోతల దుర్గారావు, గ్రామ రెవిన్యూ అధికారులు అసోసియేషన్, గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.నిప్రజా సేవలో నిమగ్నమై ఉన్న అధికారులపై దౌర్జన్యానికి దిగడం అన్యాయం. ఈ ఘటన వెనుక సహకరించిన వారిని కూడా విడిచిపెట్టరాదు. మహిళ దాడి చేసి తప్పుడు ఆరోపణలు చేయడం దారుణంు అని నాయకులు స్పష్టం చేశారు.ఉద్యోగులపై ఇలాంటి దాడులు జరిగితే కఠినంగా ఎదిరిస్తామని, అవసరమైతే ఆందోళనలకు కూడా వెనుకాడబోమని సంఘాలు హెచ్చరించాయి.
జిల్లా రెవిన్యూ సంఘం, రాష్ట్ర జేఏసీ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ./ఎస్టి. అట్రాసిటీస్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు