Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపౌర హక్కుల పై రేగాటిపల్లిలో అవగాహన

పౌర హక్కుల పై రేగాటిపల్లిలో అవగాహన

- Advertisement -

రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; పౌర హక్కులపై రూరల్ పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కలిగి ఉందని, హక్కులకు ఎటువంటి భంగం కలిగిన సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. గొడవలకు దూరంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ప్రశాంతంగా జీవించేలా ఉండాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పేకాటలకు దూరంగా ఉండాలని, మద్యానికి బానిస కాకూడదని తెలిపారు. మద్యానికి బానిస అవుతే కుటుంబం నాశనం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కుల్లాయప్ప పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు