విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలిలో స్వామి యోగాలయం ఉచిత యోగా శిక్షణ సెంటర్ వారు నిర్వహించిన స్ట్రాంగ్ రూట్స్ స్ట్రాంగ్ వింగ్స్ తల్లిదండ్రులు వారి పిల్లలు అనే అంశం మీద శిక్షణ అవగాహన తరగతులు లను మోటివేషనల్ స్పీకర్ పావని చంద్రన్ ప్రొజెక్టర్ ద్వారా సమాచారాన్ని దృశ్యరూపకంగా చూపిస్తూ ప్రేరణత్మకంగా ఈ ప్రసంగాన్ని నిర్వహించడం జరిగింది. యోగా మాస్టర్స్, మోటివేషనల్ స్పీకర్స్ అయినా చంద్రశేఖర్ భువనేశ్వరి సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా ఎంతో లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు. యోగా విషయంలో తల్లిదండ్రులు పాటించవలసిన పద్ధతులు, ప్రతి మనిషికి కావలసిన మనశ్శాంతి, ఒత్తిడి నుంచి దూరం కావుట, సమాజములో టెన్షన్ నుండి బయటపడే విధానాన్ని వారు ఈ శిక్షణ అవగాహన తరగతులో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, వారి పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యోగ శిక్షణ పై అవగాహన తరగతులు
- Advertisement -
RELATED ARTICLES


