విశాలాంధ్ర – కడియం : మైనర్ల పై లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, వారికి రక్షణ కల్పించడానికి ఫోక్సో చట్టం ఎంతో అవసరమని కడియం మహిళా ఎస్ఐ పి ధనలక్ష్మి ప్రసన్న అన్నారు. సిఐ అల్లు వెంకటేశ్వరరావు ఉత్తర్వుల మేరకు ఎస్ఐ పి ధనలక్ష్మీ ప్రసన్న మరియు కడియం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో కడియం మండలం మురమండ గ్రామం డిగ్రీ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధనలక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ఫోక్సో చట్టం పిల్లల హక్కులను కాపాడుతుందని మరియు వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపారు. పోక్సో చట్టం తో పాటు, సైబర్ నేరాలు, గంజాయి వలన కలిగే దుష్పలితాలు గురించి వివరించారు. వాటిని ఉపయోగిస్తే ప్రభుత్వం విధించే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. అలాగే కొత్తగా మారిన చట్టాలపై విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి అవగాహన కలిగించారు.
ఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు
- Advertisement -
RELATED ARTICLES


