Homeఆంధ్రప్రదేశ్గంజాయి పై నిఘా

గంజాయి పై నిఘా

- Advertisement -

గంజాయి రవాణా పై నిరంతరం నిఘా ఉంటుంది

డీఎస్పీ శ్రీకాంత్ 

విశాలాంధ్ర – సీతానగరం: గంజాయి రవాణా పై నిరంతరం నిఘా పోలీసుల నిఘా ఉంటుంది అని డీఎస్సీ వై శ్రీకాంత్ అన్నారు. ప్రశాంతమైన సీతానగరం మండలంలో గంజాయి పట్టుబడ్డంతో కలకలం రేపింది. దీనిపై డీఎస్పీ శ్రీకాంత్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ గారి  ఆదేశాల మేరకు , నార్త్ జోన్ డిఎస్పి వై.శ్రీకాంత్, సి ఐ వై సత్య కిషొర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్సై డి  రామ్ కుమార్  కుమార్  గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని పక్కా సమాచారంతో సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ గ్రామ శివారులో గల మామిడ తోట వద్ద ఐదుగురిని గమనించి వారి వద్ద నుండి విఆర్ఓ సమక్షంలో 5 ప్యాకేట్స్ లో ఉన్న సుమారు 2.57 కిలోల గంజాయిని (గంజాయి విలువ సుమారు13వేలు), ఒక ద్విచక్ర వాహనం, 1500 రూపాయల నగదును వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అని అన్నారు. ఈ గంజాయిని ఒడిస్సా ఏజెన్సీ ప్రాంతం నుండి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి  చిన్న చిన్న ప్యాకేట్స్ గా చేసి వాటిని కావలిసినవారికి అమ్ముతున్నారు అని అన్నారు. వీరిపై క్రైమ్ నెo 134/2025, ఎన్ డి పి ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరిగింది అని అన్నారు. గంజాయి రవాణా, విక్రయాల చేసే వారి పై నిరంతరం నిఘా ఉంటుంది అని, అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీను, గోవింద్ ,ట్రైనింగ్ ఎస్ఐ బి సురేష్, కానిస్టేబుల్ ఎల్లరావు, కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు