Homeజిల్లాలుఅనంతపురంమతోన్మాద శక్తుల నుంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

మతోన్మాద శక్తుల నుంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం..అనంతపురం రూరల్ మండలంలో సోమల్ దొడ్డి దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొన్ని రోజుల క్రితం ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమానికి రాలేనందువలన ఈరోజు సోమల్ దొడ్డి దగ్గర ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పోడవడానికి దేశంలో ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా లౌకికవాదులు ప్రజాతంత్ర వాదులు కుల సంఘాల నాయకులు వామపక్ష భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజలు వేల సంఖ్యలో కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్లాడేవారు మనందరం సమైక్యంగా ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని మార్చే దాంట్లో ప్రయత్నం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టులు అంబేద్కర్ వాదులు ప్రజాతంత్ర వాదులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపైన దళితులపైన చిన్నారుల పైన దాడులు హత్యాచారాలు ఆపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ , సింగనమల నియోజకవర్గం కార్యదర్శి కత్తి నారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి అనంతపురం రూరల్ మండల కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి నరేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ,నాయకులు దుర్గాప్రసాద్, ఆనంద్, మంజునాథ్, చందు, సమీర్,నరసింహులు, రామంజి, సుంకయ్య, చాందు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు