Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లానేటి విద్యార్థులే రేపటి నాయకులు

నేటి విద్యార్థులే రేపటి నాయకులు

- Advertisement -

ఏసీపీ డాక్టర్ స్రవంతిరాయ్

విశాలాంధ్ర- విజయవాడ (క్రైమ్ ): విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని నార్త్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కే స్రవంతి రాయ్ అన్నారు. గాంధీనగర్ లోని చిట్టూరి హైస్కూల్లో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో నాయకత్వం ప్రతి వ్యక్తికి అవసరమైన ప్రాధాన్యమైన నైపుణ్యం అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వల్ల వారు భవిష్యత్తులో సమర్థవంతమైన పౌరులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగగలుగుతారన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వి వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పరిసరాలు, అవకాశాలు, ప్రేరణ ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు. విద్యాసంస్థలు విద్యార్థుల్లో ఈ లక్షణాలను గుర్తించి, అభివృద్ధి చేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ పి. హారిక మాట్లాడుతూ వివిధ రకాల కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేయటం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తమ పాఠశాల కృషి చేస్తుందన్నారు. పాఠశాలలో ఇటీవల నూతనంగా ఎంపిక జరిగిన స్కూల్ హౌస్ లీడర్లు, వివిధ యూనిట్ లీడర్లు, హౌస్ కెప్టెన్ లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తూ ఏసీపీ సుజాత రాయ్ వారికి బ్యాడ్జీలు అందించారు. స్కూల్ వైస్ ప్రెసిడెంట్ యు వి పుల్లారావు, సెక్రటరీ డి సుజాత, ట్రెజరర్ జి గంగాధర్, హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, ఓంకార నరసింహం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు