Thursday, December 11, 2025
Homeఆంధ్రప్రదేశ్తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన కలెక్టర్  ప్రశాంతి

తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన కలెక్టర్  ప్రశాంతి

- Advertisement -

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  జిల్లా కలెక్టర్ ,  మునిసిపల్ కమిషనర్ (ఎఫ్‌.ఎ.సి) పి. ప్రశాంతి బుధవారం తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు.  ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను ఆమె సమీక్షించి, పలు వార్డులు, పరికరాలు, రికార్డులు, మందుల నిల్వలు, టెస్టుల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై చర్చించడంతో పాటు , రికార్డులు నిర్వహణ తీరు పరిశీలించారు.
రోగులకు అందుతున్న సేవలపై ఆసక్తిగా ఆరా తీసి, ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు చేశారు.
ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని, రోజువారీ పరిశీలనతో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్శనలో ఆమె వెంట ఏఎన్ఎం రత్నం, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

 అనంత‌రం ఆమె ఫస్ట్ రిఫరల్ యూనిట్ (ఎఫ్ ఆర్‌యు) అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చిస్తూ, వైద్య ఆరోగ్య అధికారులకి, మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి కి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అయితే, కోవిడ్ అనంతరం ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించ‌డం లేద‌ని,  రోగుల రాకపోక‌లు  కూడా తక్కువగానే ఉన్నాయ‌ని  అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిని  దృష్టిలో ఉంచుకొని, ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను ఇతర అవసరమున్న ప్రాంతాల్లో వినియోగించేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. వైద్య సదుపాయాలు ప్రజలకు సులభంగా అందేలా చేసే విధంగా సేవల మళ్లింపును అవసరమైతే పరిశీలించాలన్నారు.  ఈ సంద‌ర్భంగా    డి.ఎం.హెచ్.వో డా. కె. వెంకటేశ్వరరావు, ఎం.హెచ్.ఓ డా. వి. వినూత్న, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వైద్యాధికారి డా. శ్రీవల్లి, డిప్యూటీ డిఎం హెచ్ ఓ డా. సరితలతో సమావేశం నిర్వహించి, యూనిట్ అభివృద్ధి, సిబ్బంది వినియోగం, రోగుల అవసరాలపై సమీక్ష నిర్వ‌హించారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు