Homeజిల్లాలువిజయనగరంతృప్తి రిసార్ట్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు

తృప్తి రిసార్ట్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలంలోని కంచారం గ్రామంలో ఉన్న తృప్తి రిసార్ట్‌లో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా రిసార్ట్‌లలో సంభవించే అగ్ని ప్రమాదాల ప్రధాన కారణాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్ వైరింగ్, లోపభూయిష్ట స్విచ్‌లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు వంటి ఎలక్ట్రికల్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గ్యాస్ సిలిండర్ భద్రతపై ఉ లీకేజ్‌ను గుర్తించే విధానం, రెగ్యులేటర్‌ను సరిగా అమర్చడం, వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. వివాహాలు, వేడుకల సమయంలో పటాకులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేశారు.
అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాల వినియోగం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించే పద్ధతిపై సిబ్బందికి ప్రత్యక్ష ప్రదర్శన (డెమో) ఇచ్చారు. అగ్ని మాపక పరికరాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖ సేవల కోసం 101 నంబర్‌కు వెంటనే కాల్ చేయాలని ఫైర్ ఆఫీసర్ పైల అశోక్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు