Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయి

బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయి

- Advertisement -
 ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు మహిళలకు ఉపాధితో పాటు జీవితములో మంచి సుఖశాంతులు లభిస్తాయని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎస్బిఐ కాలనీ నందుగల మానస గార్మెంట్స్ వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు జిల్లా ర్యాంప్ కోఆర్డినేటర్ వెంకటేష్ ప్రసాద్, టిడిపి పట్టణ ఇన్చార్జ్ పరిసే సుధాకర్, టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ పురుషోత్తం గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటువంటి వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు ఉచితంగా ఇవ్వడం నిజంగా అభినందనీయమని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్ఐఎం ఎస్ఎంఈ, ఏపిఎం ఎస్ఎంఈ వారి సహకారంతో పట్టణంలో మానస గార్మెంట్స్ కార్యక్రమము నిర్వహించడం శుభదాయకమన్నారు. ఇటువంటివి స్వయం ఉపాధిగా ఎదగాలన్న వారి కోసం ఒక్క నెల రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందించదగ్గ విషయం అని తెలిపారు. అనంతరం మానస గార్మెంట్స్ అధినేత లక్ష్మమ్మ, ఇంచార్జ్ ఆర్ మానస మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు 30 రోజులు పాటు 90 మందికి ఉచితంగా ఈ రెండు కోర్సులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 21 వ వార్డు ఇంచార్జ్ సీనా, మానస గార్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు