విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శ్రీ గణేష్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు యశస్విని, అలేఖ్య బాస్కెట్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 14,15,16 వ తేదీల్లో పిఠాపురం నందు కొణిదెల వెంకట్రావ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ ఏపీ స్టేట్ జూనియర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ – 2025 నందు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలవడం జరిగింది అని తెలిపారు.ఈ జట్టు తరపున బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థినులు యశస్విని, అలేఖ్య బాస్కెట్ బాల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీల్లో కూడా రాణించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా వీరు బాగా రాణించి కన్నవారికి, పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగశేఖర్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బాస్కెట్బాల్ పోటీల్లో సుందరయ్య నగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థినుల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


