ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేహెచ్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కౌన్సిలింగ్ కొరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఆధారంగా డిగ్రీ మొదటి సంవత్సరం చేరదలచిన విద్యార్థులకు అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 26 వ తేదీ లోపు విద్యార్థులoదరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీలు రూ.400 ; బీసీలు రూ.300; ఎస్సీ,ఎస్టీ లు రూ 200 చొప్పున చెల్లించవలసి వుంటుంది అని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువ పత్రాలపరిశీలన ఈ నెల 25తేదీనుండి 28వరకు నిర్వహించబడుతుంది అని తెలిపారు. కోర్సుల కళాశాల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవడానికి 24వ తేదీ నుండి28 వరకు అవకాశం కలదు అని తెలిపారు. వెబ్ ఆప్షన్ మార్పు 29వ తేదీ, సీట్ల కేటాయింపు 31వ తేదీన జరుగనున్నాయి అని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి అని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేసుకోవడానికి కళాశాల లో అవకాశం కలదన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు కళాశాలలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


