Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

ప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

- Advertisement -

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు నమోదు చేసుకోవాలని, ప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటుకు సంబంధించిన పలు విషయాలపై వారు సలహాలు, సూచనలు తెలియజేశారు. తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమస్యలకు పరిష్కారాన్ని కూడా వారు తెలియజేశారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలలో 295 పోలింగ్ బూతులకు గాను 295 మంది బిఎల్ఓ లను నియామకం చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ సంబంధిత ఓటర్ల గురించి, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర సమస్యల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు నూతన ఓటరు నమోదు కొరకు ఎన్ వి ఎస్ టి యాప్, లేదా ఓటర్ హెల్ప్ యాప్ ను ఉపయోగించుకొని ఓటర్ను నమోదు చేసుకుని అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి బిఎల్ ఏజెంట్ల జాబితాలు తొందరగా ఆర్డిఓ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, సిబ్బంది రాజకుమార్ తోపాటు వైయస్సార్, బిజెపి, సిపిఎం, జనసేన, కాంగ్రెస్, నవతరం పార్టీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు