టిడిపి కార్యకర్తలు జోలికి వస్తే ఖబర్దార్,…
భౌతిక దాడులు చేయడం సబబేనా…
విశాలాంధ్ర -చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ వాసి శివ, టిడిపి నాయకుడు వేణు రెడ్డి, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఇరువురి మధ్య ఘర్షణ చేసుకొని ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు, శివ, బాబు రెడ్డి అను ఇరువురు పొలం వద్ద నుండి వస్తూ ఉండగా ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మార్గమధ్యంలో ఉండి, శివ కుటుంబీకులపై దూషించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నీతో పనిలేదు నీతో ఎప్పుడో ఎలిమినేట్ చేయాలని చూసాము, ఇంకోసారి మాపై వస్తే ఏదో ఒకటి చేసేస్తామని ఎంపీపీ అన్నారని, అతనితో నాకు ప్రాణహాని ఉందని టిడిపి కార్యకర్త వేణు రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు, దీంతో రెచ్చిపోయిన ఇరువురు ఆసుపత్రి పాలయ్యారు ఈ నేపథ్యంలో టిడిపి మండల కన్వీనర్ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, జడ్పిటిసి మామ నాగరాజు యాదవ్, తదితరులు మాట్లాడుతూ కార్యకర్తలు జోలికి వస్తే ఖబర్దార్ భౌతిక దాడులు చేయడం మానుకోండి కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్న మాపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు, గత ఎమ్మెల్యే ఎన్నికలలో రౌడీ ముక్కులను గుండాలను వేసుకొని అదే హుస్సేన్ పురంలో అల్లరు చేసి రక్త గాయాలు చేసింది ఎవరో అందరికీ తెలుసు, ఎవరెవరు పై కేసు నమోదు అయ్యాయో కూడా తెలుసు, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, ఎమ్మెల్యే బాలయ్య నాయకులను కార్యకర్తలను ఏకతాటిపై నడిపిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే, అది చూసి ఓర్వలేక నీచ రాజకీయాలు చేయడమేంటని, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి అభివృద్ధివైపు అడుగులు వేసేలా చూడండి, అంతేగాని కక్షలు, భౌతిక దాడులు, కుళ్ళు కుతంత్రాలు మానుకోవాలని హితో పలికారు, స్వాతంత్ర దినోత్సవము రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు హాజరుకాని ఆయన మండలాన్ని ఎలా ఉద్ధరిస్తారని హేళన చేశారు, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టిడిపి కార్యకర్త, ఎంపీపీల మధ్య ఘర్షణ…
- Advertisement -
RELATED ARTICLES


