విశాలాంధ్ర ధర్మవరం;: ఈనెల 27వ తేదీన నిర్వహించుకునే వినాయక చవితి పండుగలు శాంతిహితంగా సాఫీగా ప్రజలందరూ జరుపుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో వివిధ ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రత ఏర్పాట్ల కోసం పోలీస్ శాఖ తగిన బలగాలను మొహరించాలని తెలిపారు. సీసీ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ ,నీటి సరఫరా శాఖ త్రాగునీరు, శుభ్రత చెత్త తొలగింపు చర్యలకు సంబంధించిన మున్సిపాలిటీ శాఖ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పండుగ రోజున నీటి కొరత లేకుండా చూడాలని వారు ఆదేశించారు. అలాగే వినాయక మండపాల వద్ద, నిమజ్జన ప్రదేశాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగిన వెలుగులు ఏర్పాటు చేయడం లో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధను ఘనపరచాలన్నారు. అగ్నిమాపక సహకారంతో నిమజ్జన కుంటలు, భద్రతా కంచెలు, లైటింగు, ప్రాణ రక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా వైద్యశాఖ తరఫున అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ సౌకర్యాలలో సిద్ధంగా ఉంచాలని అధికారులను వారు ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీలు పండుగను పర్యావరణ సహిత విగ్రహాలు, శబ్ద కాలుష్య నివారణ, నిబంధనల ప్రకారం పండుగ నిర్వహణలో లోపాలు లేకుండా జరుపుకోవాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు కమిటీలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే పండుగను విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల తాసిల్దార్లు, పోలీస్ శాఖ అధికారులు, అగ్నిమాపక, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోండి.. ఆర్డీవో మహేష్
- Advertisement -
RELATED ARTICLES


