Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి

నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి

- Advertisement -

జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్

విశాలాంధ్ర బ్యూరో -శ్రీ సత్యసాయి : నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నుండి ..జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలసి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, స్వమిత్వా, ఈ పి టి ఎస్ డాక్యుమెంట్ అప్‌లోడ్, అన్నాదత సుఖిభవ,ఇ-క్రాప్ బుకింగ్, ఎలక్షన్స్ ఫారం 6, 7, 8, జి ఎస్ డబ్ల్యూ ఎస్ స్టాఫ్ బయో మెట్రిక్ హాజరు వివిధ అంశాల పై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గాలు, మండలాల ప్రత్యేక అధికారులు,తహశీల్దార్లు,ఎంపిడిఓ లు,పంచాయతీ సెక్రటరీ లు మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు. ప్రతి హెచ్ ఓ డి ఇ పి టి ఎస్ లాగ్ ఇన్ అయ్యి కరెక్ట్ డేటాను అప్లోడ్ చేయాలని,ఐ ఇ పి టి ఎస్ లో డేటా అప్ లోడ్ చేయడం లో ఏమైనా ఇబ్బందులు ఉంటే సి పి ఓ ను సంప్రదించాలన్నారు. ఎలక్షన్ పార్మ్స్6,7,8 సంబంధించి ఈ ఆర్ ఓ లు,బి యల్ ఓ ల సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు అప్ లోడు చేసేలా ఆర్ డి ఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ స్టాఫ్ బయో మెట్రిక్ హాజరు పెంచాలని,ఈ క్రాప్ కు సంపాందించి ఈ కె వై సి పెండింగ్ లేకుండా వి ఆర్ ఓ లు క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలన్నారు. గ్రామ,పట్టణంలో ప్రతి రోజు ఇంటింటి నుండి చెత్త సేకరించాలని దీని పై పంచాయతీ సెక్రటరీ లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ప్రతి 15 రోజులకు ఒక్కసారి తప్పని సరిగా ఓవర్ హెడ్ టాంక్స్ ను క్లినింగ్ చేసి క్లోరినేషన్ చేయాలని,పైపులు లీకేజీ లేకుండా చూడాలని, వర్షాల వల్ల దోమలు అభివృద్ధి చెందకుండా పాగింగ్ చేయాలని, పబ్లిక్ టాయిలెట్స్ వద్ద నీటి సరాఫరా తో పాటు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల,మండలాల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ,మండల స్థాయిలో చేపట్టవలసిన పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిర్దేశించిన లక్ష్యాలు పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి పి ఓ. విజయ కుమార్, డి పి ఓ.సమత,ఇంచార్జి డి ఆర్ ఓ. సూర్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు