Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాసన కేంద్రమును ప్రారంభించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

యోగాసన కేంద్రమును ప్రారంభించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ వద్ద మున్సిపల్ భవనం పైన మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో, ధర్మవరం యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ నిత్య ధ్యాన యోగా సాధన కేంద్రాన్ని మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, యోగా ద్వారా శారీరక ఆరోగ్యము లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ధ్యానం ఎంతో అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా నిర్వాహకులు సాకే ఈశ్వరయ్య సోమేశ్వర్ రెడ్డి సాయి ప్రసాద్, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్, కార్యదర్శి ఓబులేసు, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ డి టి మైదానంలో రెండవ రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు హాజరై జట్లకు ప్రోత్సాహాన్ని అందించారు. బిజెపి పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ టాస్ వేసి ప్రారంభించారు. రెండవ మ్యాచును బిజెపి నాయకులు అంబటి సతీష్, గుండా పుల్లయ్య టాస్ వేసి ప్రారంభించారు. మూడవ మ్యాచ్ కూడా హోరాహోరీగా కొనసాగింది. ఈ పోరులో లక్ష్మీ నరసింహ అగ్రహారం జట్టు 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో శ్యామ్ రావు జూటూరు వెంకటేష్ నారా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనబీబీ ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజులపాటు పర్యటించనున్నారని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈనెల 22వ తేదీన 10 గంటలకు అనంతపురం జడ్పీ మీటింగ్ హాల్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొంటారని, తదుపరి 11:30 నిమిషాలకు సోమందేపల్లి శ్రీ చౌడేశ్వరి కాలనీలో శ్రీ కృష్ణాష్టమి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, తదుపరి మధ్యాహ్నం 1బీ30 నిమిషాలకు ధర్మవరం రూరల్ కత్తే వారి కొట్టాల గ్రామంలో కాటమయ్య స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొంటారని, సాయంత్రం నాలుగు గంటలకు సానే వారి పల్లి హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు
అదేవిధంగా ఈనెల 23వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు రాంనగర్లో రోడ్లు ములుగు కాలువల శంకుస్థాపన, పెంపుడు జంతువుల ఆసుపత్రిని ప్రారంభిస్తారని తెలిపారు. కావున ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు