Wednesday, January 14, 2026
Homeజిల్లాలువిశాఖపట్నంబిజెపి, వైసిపి, టిడిపి త్రీ ఇన్ వన్ పార్టీలు

బిజెపి, వైసిపి, టిడిపి త్రీ ఇన్ వన్ పార్టీలు

- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్
విశాఖపట్నం; దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ కూడా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను కూడా ఒక బిలీనియర్. చంద్రబాబు, జగన్ ఇద్దరు బిలినియర్ల చేతిలో రాష్ట్ర రాజకీయాలు బ్రష్టు పట్టి పోతోంది. బిజెపి, వైసిపి, టిడిపి త్రీ ఇన్ వన్ పార్టీలు. కాంగ్రెస్ తెచ్చిన పథకాలను, విజయాలను వైయస్ కుటుంబం తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు దిన దినానికి బాగా బ్రష్టు పట్టి పోతోంది. జగన్ బటన్ నొక్కడం తప్ప, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశారు?చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉత్తుత్తి మాటలు, ఉపన్యాసాలు తప్ప, ఆయన ఏమీ సాధించలేకపోయారు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో, సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మూడు నెలల క్రితం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, లేకుంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నేను కోరాను.కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడగలుగుతుంది. సంక్షోభం నుంచి బయటకు తేగలుగుతుంది.2004లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు జతకట్టిన తరువాత, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు, ప్రకాష్ కారత్ గారు కోరారు. సోనియా గాంధీ గారు అంగీకరించారు. రైతు కూలీల వ్యక్తిత్వాన్ని నిలబెట్టేదాని కొరకు, ఉపాధి హామీ చట్టం యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. మళ్లీ భూస్వాముల కాళ్ళ కింద రైతు కూలీలను బానిసలుగా చేసేందుకు, బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసింది.


.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు