కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాలాంజనేయ స్వామి వారి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో గీత కులాలకు ( యాత, శెట్టిబలిజ, గౌడ, శ్రీ శయన ) భవనానికి తగిన స్థలం కేటాయింపు చేయాలని. జ్ఞానాపురం హోల్ సేల్ మార్కెట్ కు విస్తరణకు వేరొక చోట అనువైన స్థలం కేటాయించాలని, ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలని మరియు నిర్మాణం చేపట్టాలని, యు పి హెచ్ సి లో ఆధునికీకరణ, సచివాలయంలో తగినంత సిబ్బందితోపాటు పరికరాలు అందజేయాలని, హయగ్రీవ సమస్య పరిష్కరించాలని, నియోజకవర్గంలో ఎండోమెంట్ సమస్య పరిష్కరించాలని, పారిశుద్ధ్యం, మంచి నీటి సదుపాయాలు, డంపింగ్ యార్డ్స్ , రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పై జిల్లా సమీక్ష సమావేశం మండలి సమావేశం లో ప్రస్తావించారు.
జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
- Advertisement -
RELATED ARTICLES


