Homeజిల్లాలువిశాఖపట్నంపెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

- Advertisement -

విశాలాంధ్ర కైకలూరు:ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.శుక్రవారం పెద్దింటి అమ్మవారి జాతర సమన్వయ కమిటీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వచ్చే నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని,ఫిబ్రవరి 28న పెద్దింటమ్మ సమేత జలదుర్గా గోకర్ణేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు ఎమ్మెల్యే డా. కామినేనికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని మాట్లాడుతూ అమ్మవారి జాతర ఉత్సవాలకు పకడ్బంధీ ఏర్పాట్లుచేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి దర్శనం సక్రమంగా జరిగేటట్టు చూడాలని ఆదేశించారు. ఆలయం వద్ద బారీ కేడింగ్, తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు, వంటలు చేసుకునేందుకు ఏర్పాట్లు, చలువపందిళ్ల ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. వైద్యశిబిరంలో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడా ఏ చిన్న
పొరపాటుకు ఆస్కారం లేకుండా అమ్మవారి జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని డా. కామినేని శ్రీనివాస్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఎ కూటమి నాయకులు, దేవస్థానంసిబ్బంది, కమిటీ సభ్యులు, కొల్లేటిలంక గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు