విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కోసిగిలో శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, టీడీపీ నేతలు భీమన్న, రంగన్న, కాసిం, శాంతప్ప, నాగరాజు, బజారి, దేవదానం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, సొసైటీ ఛైర్మన్లు మీసేవ ఆంజనేయులు, కందనాతి నరసప్ప, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శులు నరసన్న, మునెప్ప, సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యన్న గౌడ్, నాయకులు దుమ్మల శివ, రామలింగ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు
- Advertisement -
RELATED ARTICLES


