-ఈఓ చంద్రశేఖర్,
విశాలాంధ్ర- వలేటివారిపాలెం; బడుగు ,బలహీన వర్గాల తరపున నిలిచి ప్రజల పక్షాన నిలిచి పోరాడే పత్రిక జాతీయదినపత్రిక విశాలాంధ్ర పత్రిక అని మాలకొండ ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్. చంద్రశేఖర్,వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. విశాలాంధ్ర దినపత్రిక నూతన సంవత్సర కేలండర్ ను శనివారం విశాలాంధ్ర విలేఖరి యం. రత్తయ్య ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాలకొండ ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్. చంద్రశేఖర్, ఎస్ ఐ మరిడి నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.నిజాలను నిర్భయంగా రాస్తున్న ఏకైక పత్రిక విశాలాంధ్ర పత్రిక అని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పత్రిక పోటీ ప్రపంచంలో ఇతర పత్రికలకు దీటుగా విశాలాంధ్ర పాఠకులకు అనుగుణంగా వార్తలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ప్రశంసలు పొందుతున్నదని అన్నారు. ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు కధనాల రూపంలో అందిస్తూ ప్రజలను జాగ్రత్త పరుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


