-జిల్లా గ్రంథాలయ ముఖ్య కార్యదర్శి రమ
విశాలాంధ్ర- ధర్మవరం: గ్రంథాలయములో పాఠకులకు కావలసిన అన్ని వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రంథాలయ జిల్లా ముఖ్య కార్యదర్శి పి. రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌరశాక గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రంథాలయానికి సంబంధించిన పలు రికార్డులను వారు పరిశీలించారు. తదుపరి గ్రంధాలయ ఎస్ఎస్ బకాయిలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని సూచించారు. పాఠకుల సభ్యత్వం ను పెంచాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి లోటు పాటు లేకుండా, ఫిర్యాదులు లేకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. సమయపాలన చాలా ముఖ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది రాము, రమణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పాఠకులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోండి
- Advertisement -
RELATED ARTICLES


