Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాకతీయ విద్యానికేతన్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు

కాకతీయ విద్యానికేతన్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం; స్థానిక కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. పాఠశాల ఆవరణమంతా రంగురంగుల ముగ్గులతో, రక రకాల పూలతో, గొబ్బెమ్మలు, భోగి మంటలు పాల పొంగులతో అందంగా అలంకరించారు.. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు.. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోశారు. విద్యార్థులకు రంగవల్లుల పోటీ నిర్వహించారు. సంక్రాంతి విశిష్టతను పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి నిర్మలా దేవి విద్యార్థులందరికీ చక్కగా వివరించారు. రంగవల్లుల మధ్య విద్యార్థుల నృత్యాలు హరిదాసు వేషధారణ అందరిని ఆకర్షింప చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్లు s.సూర్య ప్రకాష్.రెడ్డి ,.పద్మ, ఉపాధ్యాయులు , విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు