– ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్
విశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 11వ తేదీ (11.01.2026) ఆదఆదివారం ఉదయం 9 గంటలకు ధర్మవరం హైస్కూల్ గ్రౌండ్ నందు సత్యసాయి జిల్లా జూనియర్,సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టు ఎంపికలు జరుగునని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్,హాకీ శ్రీసత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ బి. సూర్యప్రకాష్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు జూనియర్ క్రీడాకారులు 01-01-2007 తరువాత జన్మించి ఉండాలని .సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి ఉండాలని తెలిపారు.ఎంపికలకు హాజరగు క్రీడాకారులు తమవెంట ఆధార్ కార్డ్,బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలియజేసారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లా జూనియర్, సబ్ జూనియర్, బాలుర హాకీ జట్టు ఎంపిక పోటీలు
- Advertisement -
RELATED ARTICLES


