Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం: మారెప్ప

పేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం: మారెప్ప

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమంలో ఈ సంవత్సరంలో దాదాపు 215 వ సారి నిర్వహించడం జరిగింది అన్నారు. నేడు ధర్మవరం చెందిన రూరల్ హెడ్ కానిస్టేబుల్ మారెప్ప వారి సహకారంతో వారి చేతులు మీదుగా,ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. అనంతరం సమాజ సేవకులు కేతా లోకేష్, వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతలు ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 120 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ధర్మవరాని కి చెందిన మారెప్ప వారి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పంపిణీ జరిగింది అని తెలిపారు. అనంతరం దాతలకు కేతా లోకేష్, కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జమిందార్ మారెప్ప హాస్పిటల్ సిబ్బంది , ట్రస్టు సభ్యులు కేత లోకేష్, కన్నా వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు