శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర- ధర్మవరం; రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని శ్రీ సత్య సాయి సేవాసమితి-2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 150 మంది రోగులకు ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా వై. సత్యనారాయణ, రాధా రాణి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహాయ సహకారముతోనే ప్రతి గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి -2 నిర్వాహకులు చేస్తున్న ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది
- Advertisement -
RELATED ARTICLES


