Thursday, January 15, 2026
Homeజిల్లాలుఅనంతపురంమీకు సీమ పౌరుషం వుంటే చంద్రబాబు ను నిలదీయండి

మీకు సీమ పౌరుషం వుంటే చంద్రబాబు ను నిలదీయండి

- Advertisement -

-కూటమి నేతలపై కేతిరెడ్డి ఫైర్
విశాలాంధ్ర- ధర్మవరం; రాయలసీమ కు ఏదైనా చేశారు అంటే అది ఒక వైఎస్సార్ ఫ్యామిలీ మాత్రమే నని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నేను మాట్లాడిన మాటకు కట్టుబడి వున్నా అని,
మాకు రాయలసీమ పౌరుసం వుంది, మీకు పౌరుషం వుంటే ఇక్కడ నుండి వెళ్లిన నిధులు తిరిగి తీసుకొని రాండి మనీ తాడిపత్రి ఎమ్మెల్యే వై ఫైర్ అయ్యారు.ప్రభాకర్ రెడ్డి ని అడుగుతున్న నీకు చేతనైతే అనంతపురం నుండి పోయిన ఎయిమ్స్ ను కర్నూల్ నుండి హైకోర్టును వెనక్కు తీసుకురండి అని సవాల్ విసిరారు. కడప లో స్టీల్ ప్లాంట్ ను కట్టించండి.
నేను కాదు చెప్పింది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, చంద్రబాబు తో నాలుగు గోడల మధ్య మాట్లాడి
లిప్ట్ ఇరిగేషన్ ఆపినాను అని.ఆపడం తప్పుకాదా? రాయలసీమ కు మీరు చేసింది అన్యాయం కాదా అని కేతిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు తో మాట్లాడు ఎందుకు ఇలా చేసావు అని, లేదంటే మీరు రాయలసీమ ద్రోహులు గా మిగిలిపోతారు అని తెలిపారు.
ఇలాంటి విషయం లో మాట్లాడంది, ఏ విషయం లో మాట్లాడుతారు.
గెలుపు ఓటములు మామూలే,ఎవరెలా గెలిచి నారాన్నది అందరికి తెలుసునన్నారు.
మన ప్రాంతానికి వచ్చిన వాటిని తిరిగి ఎలా వెళ్తాయ్ అని మండిపడ్డారు.
నేను జిల్లేడు బండ ప్రాజెక్ట్ మా జగన్ రెడ్డి తో మాట్లాడి 7వందల 50 కోట్లు తీసుకోచ్చా, ఇప్పుడు వచ్చిన వారు ఎదో చేస్తామని అలాగే ఉంచారు ఎందుకు? అని నిలదీశారు. మేము తెచ్చిన వాటిని చేయలేరు.రాయలసీమ కు అన్యాయం జరుగింది అని ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు