మొక్కలు నాటుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం
బాపట్ల జిల్లాని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్
విశాలాంధ్ర-చీరాల టౌన్ : చీరాల పురపాలక సంఘ కూరగాయల మార్కెట్ వద్ద చీరాల అధికారులు నిర్వహించిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వినోద్ పాల్గొన్నారు.రోడ్లను మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని,మార్కెట్లో ఉదయం ఎక్కువగా చెత్త సమకురుతుందని మున్సిపాలిటీ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవిన్య డివిజనల్ అధికారి చంద్రశేఖర్, ఎమ్మార్వో గోపికృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


