Homeజిల్లాలుబాపట్లసూపర్ పవర్ దేశంగా భారత్

సూపర్ పవర్ దేశంగా భారత్

- Advertisement -

బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి

  • బాపట్లలో బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అధికారులు
    విశాలాంధ్ర – బాపట్ల : భారతదేశం 2070నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా, చైనా అగ్ర దేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరు ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన చెప్పారు. ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరుకానున్నారని చెప్పారు. ఈనెల 15వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ప్రతి ఒక్కరు జరుపు కోవాలని పిలుపునిచ్చారు. భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య ప్రాధాన్యత, విలువలను ప్రతి ఒక్కరికి తెలియ జేయాలని ఆయన కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో జిల్లా ఇంచార్జి సంయుక్త కలెక్టర్, డిఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డి.ఆర్ డి .ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, ఎక్సైజ్ శాఖ ఈ.ఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసిల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు