Homeఆంధ్రప్రదేశ్సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పి. హరినాథ్ రెడ్డి

సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పి. హరినాథ్ రెడ్డి

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన పి హరినాథ్ రెడ్డి ఎంపికయ్యారు. సిపిఐ 25వ జాతీయ మహాసభలు చండీగఢ్ లో ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. మహాసభలు చివరి రోజైన గురువారం జాతీయ కౌన్సిల్ నూతనంగా ఎన్నికయింది. జాతీయ కౌన్సిల్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు ఎంపిక అయ్యారు. అందులో చిత్తూరు జిల్లా సంబంధించి సీనియర్ నాయకుడైన పీ హరినాథ్ రెడ్డికి చోటు లభించింది. పార్టీలోనూ, అనుబంధ విభాగాల్లోనూ దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పదవుల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రధానంగా ఎఐటియుసి ఉద్యమాలలో కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా 2000 సంవత్సరంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేసి, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేశారు. వివిధ ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు. పేద ప్రజల పక్షాన వివిధ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రాష్ట్రంలోనే ప్రముఖ పట్టణమైన తిరుపతి పరిసర ప్రాంతాలలో వేదాంతపురం తదితరచోట్ల నిరుపేద ప్రజలకు భూ పోరాటం ద్వారా ఇళ్లస్థలాలను పంపిణీ చేశారు. దశాబ్ద కాలానికి పైగా జిల్లా కార్యదర్శిగా ఉంటూ పార్టీ కోసం తీవ్రంగా కృషి చేసిన హరినాథ్ రెడ్డి , ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. పదవులతో నిమిత్తం లేకుండా పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో తాజాగా చండీగఢ లో జాతీయ మహాసభల్లో జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ కే నారాయణ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆయన తర్వాత చిత్తూరు జిల్లా నుంచి జాతీయ కౌన్సిల్ కు ఎన్నికైన నాయకుడు హరినాథ్ రెడ్డి మాత్రమే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉంటూ విశాలాంధ్ర పత్రిక జనరల్ మేనేజర్, తిరుపతి జిల్లా పార్టీ బాధ్యులు గాను వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు