Wednesday, January 8, 2025
Home Blog Page 104

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య రంగాలకు రాష్ట్ర బడ్జెట్ లో భారీ కేటాయింపు

– ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య కోసం రూ. 18,421 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు,ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్కు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ బడ్జెట్ కేటాయింపు 23 శాతం పెరిగినట్లు తెలిపారు. పాఠశాల,కళాశాల, ఉన్నత విద్య తరవాత అత్యధికంగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేయడం ద్వారా ప్రజారోగ్య సంరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ, ఎన్డీయే ప్రభుత్వం తమ సంకల్పాన్ని ప్రదర్శించింది అని ఆయన అన్నారు.
ఈ కేటాయింపు ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయని, ప్రజల ఆరోగ్యం కోసం కీలకమైన పథకాలు, సదుపాయాలు మరింత విస్తరించనని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి మరింత ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని ఆయన తెలిపారు. ఈ ప్రగతిశీల బడ్జెట్ కేటాయింపుతో, ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కట్టుబాటును కొనసాగిస్తుందన్నారు అని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్గా కొనసాగిస్తాం..

విశాలాంధ్ర ధర్మవరం : వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్గా కొనసాగించాలని ఆరోగ్య శాఖామంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవోహంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ.. సెల్వియా సల్మాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు ,ఆశా కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పట్టణము గ్రామాలలో వినికిడి లేని వారిపై సర్వే చేసి నివేదికను తయారు చేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీ పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి ఉచితంగా వినికిడి మిషను ఇవ్వబడునని తెలిపారు. అనంతరం మంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వినికిడి లోపం ఉన్న వారిని సర్వేలో గుర్తించి అందరికీ న్యాయం జరిగేటట్లు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో పని చేసినప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లతోపాటు బిఎల్టిఓ డాక్టర్ తిప్పయ్య నాయక్, ఆప్తాలిమిక్ ఆఫీసర్, సిహెచ్వోలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్
విశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 14న తలపెట్టిన ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులతోపాటు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక అమలు సరిగా లేదని, నిత్యావసర ధరలు తగ్గించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెనువెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగుల తొలగింపును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం నిర్వహిస్తులకు పరిహారము, ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్టును విని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి తోపాటు పెద్దన్న ,సిహెచ్ భాషా, ఎస్ఎఫ్ఐ నాగార్జున పాల్గొన్నారు.

డిస్కవర్ అనంత హై క్వాలిటీ గం బూట్స్ పంపిణీ

పారిశుద్ధ్య కార్మికులను కాపాడటమే మా లక్ష్యం అనంత డిస్కవరీ అనిల్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : నగరంలోని మురికి కాలువలు దిగి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం డిస్కవర్ అనిల్ కుమార్ ముంబై నుండి హై క్వాలిటీ గం బూట్స్ తెప్పించి ఒకటవ సర్కల్లోని 14 సచివాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా అనంతపురం అనిల్ కుమార్ మాట్లాడుతూ… పారిశుద్ధ కార్మికులను కాపాడుకోవడం నగరంలోని ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. వారి బాగోగులు చూసుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యత ఎంత ఉందో మన కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ కార్మికుల బాగోగులు ప్రతి పౌరుని బాధ్యత కూడా అంతే ఉందన్నారు . ఈ గం బూట్లు పంపిణీ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలు సుమారు 150 మంది కార్మికులకు ఈ గం బూట్స్ అందజేస్తామని దీనికి సుమారు 1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఈ గం బూట్స్ ను డంప్యాడ్లో జీవనోపాధి కోసం చెత్త లో ఉండే ఐరన్, ఇతర వస్తువులను ఏరుకునే వారు కి కూడా అందజేసి డంప్యాడ్ లో వెళ్లే ప్రతి ఒక్కరు ఈ బూట్లు ధరించే విధంగా చేస్తామన్నారు. బూట్లు ధరించి డంప్యాడ్ లో వెళ్లే వారికి ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.

బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్..

నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయవద్దని ఆదేశాలు

బుల్డోజర్ న్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ
నిర్మాణాల కూల్చివేతకు 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు
నోటీసులను రిజిస్టర్డ్ పోస్టులో పంపడంతోపాటు నిర్మాణం వెలుపల అంటించాలని ఆదేశాలు
నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలన్న ధర్మాసనం
రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని స్పష్టీకరణ
రూల్ ఆఫ్ లాను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు బుల్డోజర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కూల్చివేతకు 15 రోజుల ముందు భవన యజమానికి నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించాల్సిందేనని పేర్కొంది. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణం వెలుపల నోటీసులు అంటించాలని తెలిపింది.

ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కూల్చివేతను వీడియో తీయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా చట్ట నియమాలు తప్పనిసరని, చట్టపరమైన ప్రక్రియ అటువంటి చర్యను క్షమించదని స్పష్టం చేసింది.

కార్యనిర్వహణ అధికారే న్యాయమూర్తి పాత్ర పోషించి చట్టాన్ని పాటించకుండా ఇంటి కూల్చివేతకు ఆదేశాలిస్తే అది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత వెబ్‌సైట్‌లో నోటీసులను ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, నోటీసులను తప్పకుండా రిజిస్టర్డ్ పోస్టులోనే పంపాలని పేర్కొంది.

సోషల్‌ మీడియాలో పోస్టులపై పిల్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

వారం రోజులపాటు కురుస్తాయన్న వాతావరణశాఖ
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కుండపోత వానల కారణంగా మయిలదుథురై, కరైకల్, పుదుచ్చేరిలలో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడగా, కడలూర్, అయిలూర్, పెరంబలూర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తీరప్రాంతాలైన చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం, రాణిపేట్, కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి, రామనాథపురం, విరుధునగర్, మదురై జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని 15కు పైగా జిల్లాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో చెన్నైలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ాడిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీః విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ాసేవ్ అమెరికా్ణ ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు్ణ్ణ అని ట్రంప్ వెల్లడించారు. కాగా గతవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. భారీగా విరాళాలు అందించడమే కాకుండా ట్రంప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

ఫలితాలు వెలువడిన తర్వాత ావిక్టరీ స్పీచ్్ణలో ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి, మేధావి అని అభివర్ణించారు. ాామనకో కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్్ణ్ణ అని అన్నారు. రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తనతో కలిసి ఆయన ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు.

ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్‌కు ఒంగోలు పోలీసులు

వ్య‌క్తిగ‌తంగా ఆ నోటీసులు ఆర్‌జీవికి ఇచ్చేందుకు హైద‌రాబాద్‌కు ఒంగోలు పోలీసులు
ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. ఎస్ఐ శివ‌రామ‌య్య ఆధ్వ‌ర్యంలోని బృందం ఇవాళ ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ ధ్రువీక‌రించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో ఆర్‌జీవీ.. అప్ప‌టి ప్ర‌తి ప‌క్ష‌నేత, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వాల‌ను కించ‌ప‌రిచేలా ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్టులు పెట్టారంటూ ప్ర‌కాశం జిల్లా ‌మద్దిపాడు పీఎస్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో భాగంగా విచార‌ణ‌కు హాజరు కావాల‌ని ఆయ‌న‌కు నోటీసులు రెడీ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఒంగోలు పోలీసులు వ్య‌క్తిగ‌తంగా ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్ రావ‌డం జ‌రుగుతోంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కంటతడి..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటతడి పెట్టాడు. సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ ాగాడ్ బ్లెస్‌ అమెరికా పాట ఆలపిస్తూ బైడెన్ కంటతడి పెట్టడం, ఆ తర్వాత కన్నీళ్లను తుడుచుకోవడం వీడియోలో కనిపించింది. అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారని అన్నారు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పారు. తన కుమారుడు బ్యూ బైడెన్ కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని చెప్పారు. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015 లో గ్లియోబ్లాస్టోమా వ్యాధి కారణంగా చనిపోయాడు.